భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డిమంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించు కుంటు రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధి పనులు గుర్తుచేసుకుని, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని వీడుతున్నందుకు..ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
