ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు విశాఖపట్నంలో జరుగుతోంది. సిటీలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరుగుతున్న ఈ సదస్సుకి సీఎం వైయస్ జగన్ గారితో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ మంత్రులు హాజరయ్యారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు 74 దేశాల నుంచి అతిథులు వైజాగ్‌కి వచ్చారు.
