ప్రజా సేవలో వైఎస్సార్ ను మించిపోయాడు. మళ్లీ నువ్వే సీఎం.. నీకు తిరుగులేదయ్యా.. జగన్ లాంటి దమ్మున్న లీడర్ ను చూడలేదు..
జగనన్న ఆరోగ్య సురక్షా స్కీమ్ పై జయప్రకాశ్ నారాయణ.. సీఎం జగన్ ను కొనియాడారు. ఏపీలో ఆరోగ్య సురక్ష పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లే ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి ఆరోగ్య కార్యకర్తలను పంపించి ఒక స్క్రీనింగ్ చేయడం.. ఒక బేస్ లైన్.. అక్కడ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయడం.. హెల్త్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేసే ప్రక్రియ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. ఆరోగ్య రంగంలో ఏ శ్రద్ధ చూపెట్టినా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. వివిధ రాష్ట్రాల్లో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా కొంత ప్రయత్నం అయితే జరుగుతోంది అని జయ ప్రకాష్ నారాయణ అన్నారు.మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్సార్ కాలంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. అలాగే.. ఇప్పుడు ఆరోగ్య సురక్షను తీసుకొచ్చారు. మన దేశంలో అనారోగ్య కారణాలుగా, ఆరోగ్య సమస్యల వల్ల.. అనారోగ్యానికి డబ్బులు పెట్టలేక కోట్ల మంది ఇంకా పేదరికంలో మగ్గిపోతున్నారు. అలాంటి దేశంలో ప్రభుత్వాలు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మనం ఆహ్వానించాలి. అందులోనూ మనకు దీర్ఘకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్, అంటు వ్యాధులు, బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే సగటు వయసు పెరుగుతోందో జీవనశైలి మారుతోందో దీర్ఘకాల వ్యాధులు పెరుగుతున్నాయని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.