బీజేపీకి ఇప్పుడు తాము చాలా కీలకమనుకుంటున్న వైసీపీ…

Good news for pensioners in AP

ఏపీ సీఎం జగన్ లండన్ నుంచి రాక ముందే 13 , 14 తేదీల్లో ఢిల్లీకి వెళ్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా అపాయింట్‌మెంట్లు ఖరారు కాలేదు. శుక్రవారం ఆయన మెడికల్ కాలేజీను ప్రారంభించడానికి విజయనగరం వెళ్తున్నారు. అంటే ఢిల్లీ పర్యటనపై స్పష్టత లేదు. అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాజ్యాంగం ప్రకారం 20వ తేదీలోపు అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంది. అయితే 21 నుంచి అయినా పెట్టవచ్చని అంటున్నారు. ఆరునెలల్లోపు అసెంబ్లీ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాల తర్వాత మళ్లీ అసెంబ్లీని నిర్వహించలేదు. 20వ తేదీతో ఆరు నెలలు పూర్తవుతాయి. అందుకే 21న నుంచి పెట్టాలని అనుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ, మహిళా బిల్లులను ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం NDA పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది. పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. లోక్‌సభలో బీజేపీకి 333 సీట్ల ఉన్నందున 61 శాతం మద్దతు ఉన్నట్టే. కానీ.. బిల్లు ఆమోదానికి మరో 5 శాతం ఓటింగ్ అవసరం. లోక్‌సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో చూసుకున్నా… 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు. పార్లమెంట్‌లో ఇప్పటివరకు ఎన్టీయే సర్కార్‌ తీసుకొచ్చిన బిల్లులకు వైఆర్‌ఎస్‌సీపీ మద్దతు ఇచ్చింది. వర్షా అయితే.. ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులకు తాము ఎంతో కీలకమని.. అందుకే తమకు సహకరించక తప్పదని.. తాము చేసే పనులను చూస్తూ ఊరుకోవాల్సిందేనన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తున్నట్లుగా ఢిల్లీ బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these