తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు భారీ షాక్ తగిలింది. సీఐడీ నమోదు చేసిన స్కిల్ స్కాంలో టీడీపీ లెక్క తప్పింది. లూద్రా వాదనలతో గట్టెక్కుతామని భావించినా కోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే, టీడీపీ నేతలు ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కుట్ర గా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం వెనుక కేంద్ర పెద్దల పాత్ర పైన ఆసక్తికర చర్చ సాగుతోంది. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ ఈ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.
రాజకీయ వ్యూహాలతో:స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్..కోర్టు రిమాండ్ విధించటం సంచలనంగా మారింది. అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సీఐడీ అర్దంలేని ఆరోపణలు..సెక్షన్లు నమోదు చేసిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. కానీ, ఇరుపక్షల వాదనలు విన్న న్యాయస్థానం సీఐడీ నమోదు చేసిన సెక్షన్లను పరిగణలోకి తీసుకుంది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబును రాజమండ్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం పైన రాజకీయంగా భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో సీఎం జగన్ ను టీడీపీ టార్గెట్ చేస్తుంటే..దీని వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ స్కెచ్ ఉందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఢిల్లీ నేతలు ఉన్నారా:కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా వంటి ముఖ్యుల మద్దతు లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని సీపీఐ నేతలు ఓపెన్ గా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అటు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారి మద్దతుతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందనే వాదన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వెనక కచ్చితంగా మోదీ, అమిత్ షా మద్దతు ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీని నమ్మొద్దని దూరంగా ఉండాలంటూ ఆయన సూచించారు.
ఒక వైపు బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీని తమతో కలుపుకు వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక ఢిల్లీలోని ముఖ్య నేతలు ఉన్నారనే ప్రచారం పవన్ కు మింగుడు పడని అంశం. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ పైనే గురి పెట్టారు. కేంద్రంలోని ముఖ్యనేతల ప్రమేయం గురించి ఎక్కడా ప్రస్తావన చేయటం లేదు.
ర్తలువీడియోలు ఆరోగ్యం గ్యాలరీ రాజకీయాలు మూవీస్/గాసిప్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ కూపన్లు లైవ్ టీవీ నగరం వ్యవసాయం స్పోర్ట్స్ జాతీయ వార్తలు అంతర్జాతీయం మనీ జ్యోతిషం ప్రకటన ఎన్నారై టాక్ ఆఫ్ టుడే ట్రెండింగ్ వీడియోలుఆంధ్రప్రదేశ్చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దలు..!?By ChaitanyaUpdated: Sunday, September 10, 2023, 22:13 [IST]తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు భారీ షాక్ తగిలింది. సీఐడీ నమోదు చేసిన స్కిల్ స్కాంలో టీడీపీ లెక్క తప్పింది. లూద్రా వాదనలతో గట్టెక్కుతామని భావించినా కోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. అయితే, టీడీపీ నేతలు ఇదంతా ముఖ్యమంత్రి జగన్ కుట్ర గా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం వెనుక కేంద్ర పెద్దల పాత్ర పైన ఆసక్తికర చర్చ సాగుతోంది. పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న వేళ ఈ రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.ADVERTISEMENTరాజకీయ వ్యూహాలతో:స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్..కోర్టు రిమాండ్ విధించటం సంచలనంగా మారింది. అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సీఐడీ అర్దంలేని ఆరోపణలు..సెక్షన్లు నమోదు చేసిందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. కానీ, ఇరుపక్షల వాదనలు విన్న న్యాయస్థానం సీఐడీ నమోదు చేసిన సెక్షన్లను పరిగణలోకి తీసుకుంది. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబును రాజమండ్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం పైన రాజకీయంగా భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంలో సీఎం జగన్ ను టీడీపీ టార్గెట్ చేస్తుంటే..దీని వెనుక ఢిల్లీ పెద్దల మాస్టర్ స్కెచ్ ఉందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.ADVERTISEMENTWhos really responsible for Chandrababus arrest,A closer lookఢిల్లీ నేతలు ఉన్నారా:కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా వంటి ముఖ్యుల మద్దతు లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరగదని సీపీఐ నేతలు ఓపెన్ గా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు అటు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో వారి మద్దతుతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందనే వాదన టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు వెనక కచ్చితంగా మోదీ, అమిత్ షా మద్దతు ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీని నమ్మొద్దని దూరంగా ఉండాలంటూ ఆయన సూచించారు.ఒక వైపు బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీని తమతో కలుపుకు వెళ్లాలనేది పవన్ ఆలోచన. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక ఢిల్లీలోని ముఖ్య నేతలు ఉన్నారనే ప్రచారం పవన్ కు మింగుడు పడని అంశం. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ పైనే గురి పెట్టారు. కేంద్రంలోని ముఖ్యనేతల ప్రమేయం గురించి ఎక్కడా ప్రస్తావన చేయటం లేదు.
పొత్తులు కొనసాగేనా:ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం ఎన్నికల పొత్తులపైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. జగన్ ను ఓడించేందుకు బీజేపీతో కలిసే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ సమయంలోనే జగన్ అలర్ట్ అయ్యారు. చంద్రబాబు అవినీతిని తెర మీదకు తీసుకొచ్చి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చే పార్టీలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలను పదును పెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
దీంతో పాటుగా నేరుగా ఢిల్లీ నేతలే చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్నారనే ప్రచారంతో ఎన్నికల ముందు ఏపీ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. ఈ పరిణామాల పైన చంద్రబాబు రానున్న రోజుల్లో ఏ రకంగా స్పందిస్తారో…బీజేపీతో పొత్తు విషయంలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.