ఆల్ ఇండియా పుట్ బాల్ ఫెడరేషన్ డెవలప్మెంట్ కమిటీ డిప్యూటీ చైర్మన్ గా ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కోటగిరి శ్రీధర్ బాబు ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ నేటి యువత క్రీడా స్ఫూర్తితో దేశానికి ఆదర్శంగా నిలవాలని క్రీడల్లో ముఖ్యంగా ఫుట్ బాల్ క్రీడ పట్ల యువతను మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా తన వంతు సహకారం అందజేస్తానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు.
