ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలో ముందస్తు చర్చ జరిగింద జాతీయ మీడియా ప్రచారం. గత కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం జగన్ ముందస్తుకు ఆకాశవాణి లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉందని..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలతో మరోసారి ఈ చర్చ తెర మీదకు వచ్చింది
ఇప్పుడు ఏపీ మంత్రి ఈ ప్రచారం పైన స్పందించారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా మేము రెడీ అంటూ ఆయన ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని.. గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల పైనే చర్చ జరిగింది.
నాటి చంద్రబాబు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను దివాలా తీయించిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం 20 వేల కోట్ల అప్పులు చేసి, వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని. ఆ అప్పులన్నీ తీర్చామని చెప్పుకొచ్చారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని, వాటికి కేంద్రం సాయం చేయాలని కోరుతున్నాం. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.