టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఈ మధ్య హిందీ లో వరుస ఆకాశాలు అందుకుంటూ స్పీడ్ పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ రణబీర్ కపూర్ కి జోడీ గా యానిమల్ లో ప్రస్తుతం నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ నిర్మిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
తాజాగా రష్మిక యానిమల్ షూటింగ్ కి సంబంధించి తన లాస్ట్ డేని కంప్లీట్ చేసింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసుకొని పంచుకుంది. రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా తో పాటు మొత్తం యానిమల్ టీమ్ తో కలిసి దిగిన ఫోటోలని రష్మిక పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. యానిమల్ షూటింగ్ లో నైట్ షూటింగ్ తో నా లాస్ట్ డే కంప్లీట్ చేసినట్లు రష్మిక మందన అందు లో రాసుకొచ్చింది.
తనకి సంబందించిన సీక్వెన్స్ అన్ని పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50 రోజుల షూటింగ్ షెడ్యూల్ ని ఫినిష్ చేసుకొని ఆమె యానిమల్ టీమ్ కి సెండాఫ్ చెప్పేసి హైదరాబాద్ తిరిగి వస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తోన్న పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఆమె జాయిన్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన బన్నీ రష్మిక మధ్య కీలక ఎపిసోడ్స్ షూటింగ్ చేయడానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక యానిమల్ సినిమాకి ప్యాకప్ చెప్పిన సందర్భంగా ఫోటోలు పంచుకోవడం తో ఆసక్తికరంగా ఆమె పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పటి వరకు యానిమల్ మూవీ కోసం 50 రోజుల షూటింగ్ చేశా ను. ఈ రోజుతో నా పార్ట్ అంతా కంప్లీట్ అయ్యింది. యానిమల్ టీమ్ ని వదిలేస్తూ ఉంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఇన్ని రోజులు చాలా ఇష్టంగా వారి తో కలిసి పని చేశాను.
టీమ్ అంతా నన్ను అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. అందరికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని మేకింగ్ విజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా నిబద్దతతో పని చేస్తారు. నటులకి కావాల్సినంత స్వేచ్చ ఇస్తారు. కచ్చితంగా యానిమల్ లో నా పాత్ర మీ అందరికి నచ్చుతుంది అంటూ రష్మిక రాసుకొచ్చారు. ఈ ఫోటోలు పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
