ఇప్పటికే చాలా లేట్ అయ్యింది బాస్

రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ మూవీ అతనికి యూనివర్శల్ ఇమేజ్ తీసుకొచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో వేరే ఏ హీరోకి సాధ్యం కాని రికార్డులని యష్ తన సొంతం చేసుకున్నాడు. అలాగే సౌత్ లో కూడా ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని రాఖీభాయ్ అనే  ముద్రని సొంతం చేసుకున్నారు.

అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా సృష్టించిన రికార్డులు వేవ్ ని ఇంకా యష్ ఆశ్వాదిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ సినిమా గురించి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంత వరకు ఆయన నుంచి ఎలాంటి మూవీ ప్రకటన రాలేదు. Yash19  చిత్రం కోసం రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూపులకి ముగింపు పలుకుతున్నట్లే ఉంది.

నార్తన్ దర్శకత్వంలో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా లేడీ డైరెక్టర్ లైన్ లోకి వచ్చారు. మలయాళంలో నటిగా సక్సెస్ అయ్యి ఇప్పుడు దర్శకురాలిగా మారిన గీతూ మోహన్ దాస్ తో యష్ మూవీ ఒకే చేశాడు. Yash19 గా ఈ చిత్రం రాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ స్టార్ కథాంశంతోనే ఈ మూవీ ఉండబోతుందంట.

అయితే త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వస్తుందని అందరూ ఆశించారు. కాని ఈ చిత్రం మరో నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందంట. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేసే పనిలో దర్శకురాలు ఉన్నారని టాక్. అది కంప్లీట్ కాగానే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతుందంట.

అయితే ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మూవీలో యష్ కి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో గీతూ మోహన్ దాస్ ఉన్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషలకి సంబందించిన నటీనటులకి సినిమాలో అవకాశం ఇవ్వనున్నారంట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these