అన్ స్టాపబుల్

మూవీ రివ్యూ : అన్ స్టాపబుల్

నటీనటులు: విజె సన్నీ సప్తగిరి నక్షత్ర అక్సా ఖాన్ బిత్తిరి సత్తి పృథ్వీ పోసాని కృష్ణ మురళి తదితరులు

సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

దర్శకుడు : డైమండ్ రత్నబాబు

నిర్మాతలు: రంజిత్ రావు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన టాక్ షో అన్ స్టాపబుల్. రెండు సక్సెస్ ఫుల్ సీజన్ లతో ఆ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ టైటిల్ తో బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ సప్తగిరి ప్రధాన పాత్రధారులుగా సినిమా వచ్చింది. మరి అన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ కాగా అన్ స్టాపబుల్ సినిమా అదే రేంజ్ లో ఉందా లేదా అన్నది ఈనాటి సమీక్షలో చూసేద్దాం

కథ :

కోహినూర్ కళ్యాణ్ (వీజే సన్నీ) జిలాని రాందాస్(సప్తగిరి) ఇద్దరు ఫ్రెండ్స్. వారికి తోడుగా అక్సా ఖాన్ ఉంటుంది. డ్రింక్ చేసిన వారిని సేఫ్ గా ఇళ్లకు చేర్చేలా పనిచేస్తుంటారు. అయితే ఈజీ మనీ కోసం వీరు ఐపిఎల్ బెట్టింగ్ పెడతారు. అలా జిలాని రాందాస్ చెల్లి పెళ్లి కోసం ఉంచిన 20 లక్షల డబ్బులో 10 లక్షలు తెస్తాడు. అలా తెచ్చిన డబ్బు జస్ట్ మూడు బెట్టింగ్స్ తోనే పోగొడతాడు కోహినూర్ కళ్యాణ్. తన ఇంట్లో కూడా తన మదర్ బాలనగర్ బాలక్క (లిరిష) గాజులు కూడా మనప్పురం లో పెట్టాడని అతన్ని ఎటాక్ చేస్తుంది. కొహినూర్ కళ్యాణ్ జిలాని రాందాస్ ఇద్దరికి 20 లక్షల డబ్బు అవసరం పడుతుంది. ఎలాగోలా 20 లక్షలు దుబాయ్ లో ఉన్న హనీ బాబు (షకలక శంకర్) తో అకౌంట్ లో వేయించుకుంటారు. అక్కడే మిస్టేక్ జరుగుతుంది. అకౌంట్ నెంబర్ మిస్టేక్ వల్ల అది డాన్ ఖాదర్ అలియాస్ జ్ఞానవేల్ రాజా అకౌంట్ లోకి వెళ్తాయి. ఆ డబ్బు కోసం కోహినూర్ కళ్యాణ్ జిలాని రాందాస్ ఏం చేశారు. వీరికి మధ్యలో పరిచయమైన టైం టేబుల్ తులసి (నక్షత్ర) కి కొహినూర్ కళ్యాణ్ ఎలా కనెక్ట్ అయ్యాడు. వీరి సమస్యలు తీరా లేదా అన్నది మిగతా కథ.  

కథనం – విశ్లేషణ :

కామెడీ సినిమాల్లో లాజిక్ లకు తావు లేదు. అదేంటి లాజిక్ లేకుండా కామెడీ సినిమాలు చేయలేరా అంటే చేస్తారు కానీ మాక్సిమం సినిమాలు లాజిక్ లెస్ గా ఉంటాయి. అయితే లాజిక్ లెస్ గా ఉన్నా ఆడియన్స్ ని నవ్వించడంలో పాస్ అయితే అవేవి పెద్దగా పట్టించుకోరు కానీ కామెడీ సినిమా అది కూడా లాజిక్ లెస్ గా తీసి నవ్వించడం కాకుండా ఏడిపిస్తే అది మరీ కామెడీగా ఉంటుంది. సేం టు సేం అన్ స్టాపబుల్ సినిమా అదే విధంగా ఉంటుంది.

ఒక ఇద్దరు కామన్ వ్యక్తులకు అనుకోకుండా ఒక డాన్ తో ఢీ కొట్టేలా సందర్భం రావడం.. ఆ డాన్ నుంచి వారికి రావాల్సినది తీసుకోవడంలో వీళ్లు ఏం చేశారు అన్న నేపథ్యంతో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఎక్కడో ఒక చోట కథకి కానీ కామెడీకి కానీ ఆడియన్స్ ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతారు. కానీ ఆ విషయంలో ఏమాత్రం మెప్పించలేకపోయింది అన్ స్టాపబుల్.

చెల్లి పెళ్లి కోసం దాచిన 10 లక్షలు ఫ్రెండ్ ఐపిఎల్ లో బెట్టింగ్ వేద్దామనగానే ఏమాత్రం ఆలోచించకుండా వెళ్లి వాళ్ల అమ్మని అడిగితే ఆమె కూడా సరే అని తల ఊపి డబ్బులు ఇవ్వడం లాంటిది ఇంకెప్పుడు చూసి ఉండరు. 10 లక్షలు పోయాయంటే ఇంట్లో అందరు వచ్చి సప్తగిరిని కొడతారు. కూతు పెళ్లి కోసం దాచిన డబ్బు పోయింది అన్న ఒక్క సీరియస్ ఎమోషన్ కూడా చూపించలేకపోయాడు దర్శకుడు. ఇక మరోపక్క అమ్మ గాజులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడని బాలనగర్ బాలక్క ఫోన్ చేసిన ప్రతిసారి వాళ్లెవరో ఇంటి పక్కన ఉన్న లేడీస్ అంతా కూడా వీజే సన్నీని బూతులు తిడుతుంటారు.

ఈ సీన్స్ ద్వారా దర్శకుడు ప్రేక్షకులు నవ్వుతారని ఎలా ఊహించాడో అర్థం కాదు. ఇక విలన్ సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చూపించడానికి గంభీరంగా చూపించి చివరకు బకరాని చేశారు. అసలు ఈ సినిమాలో ప్లస్ ల కన్నా మైనస్ లే ఎక్కువ అందులో విలన్ అని చెప్పొచ్చు. ఒక చిన్న లైన్ రాసుకుని దాన్ని కామెడీ ఎంటర్టైనర్ గా తీద్దామని అనుకున్న దర్శకుడు డైమండ్ రత్నబాబు ఎక్కడ కూడా ఆడియన్స్ ని నవ్వించడం మాట అటుంచితే కనీసం ఒక్క సీన్ ని కూడా వారికి కనెక్ట్ చేయలేకపోతాడు.

ఇక హీరో హీరోయిన్ వీజే సన్నీ నక్షత్రల లవ్ సీన్.. బాబోయ్ ఇది మరి టూమచ్ అనిపిస్తుంది. హీరోయిన్ వాళ్ల ఫ్యామిలీ రాగానే ముద్దు పెడతాడు హీరో వెంటనే ఆమె చెంప చెల్లుమనిపిస్తుంది. వన్ వాక్ లో ప్రేమ ఏంటి అంటే.. వీక్ కాదు ఏడాది క్రితమే నిన్ను చూశా అని ఏదో ఒక సీన్ చెప్పగానే ఆమె వచ్చి కౌగిలించుకుంటుంది. డాన్ అసిస్టెంట్ దగ్గర నుంచి కొహినూర్ కళ్యాణ్ జిలాని రాందాస్ అక్సా ఖాన్ తులసి తప్పించుకునే సీన్ కూడా అంతే కామెడీ చేశారు. ఇక కొహినూర్ కళ్యాణ్ విలన్ ఖాదర్ కి చెప్పే ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే మరో లెవల్ అన్నమాట. ఈ ట్విస్ట్ కి ఆడియన్స్ ఫ్యూజులు అవుట్ అవుతాయి.

సినిమా ఎంత కామెడీ అయినా పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి కానీ అక్కడ వారు కామెడీ చేస్తున్నాం అనుకున్నారు తప్ప అది ఆడియన్స్ ని చేరువేయలేకపోయారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడి అన్ని విభాగాలుగా విఫలమయ్యడని చెప్పొచ్చు. అన్ స్టాపబుల్ లాంటి పవర్ ఫుల్ టైటిల్ వాడుకుని ఇలాంటి సినిమా తీస్తాడని ఎవరు ఊహించరు. ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ డైమండ్ రత్నబాబు సినిమా అంతా నవ్వుతూనే ఉంటారని లేకపోతే తన ఫోన్ నెంబర్ ఇది అంటూ కూడా చెప్పాడు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు అంటే సినిమాలో మంచి మ్యాటర్ ఉందని అంచనా వేశారు. కానీ థియేటర్ లోకి వెళ్లి చూస్తే ఎప్పుడు సినిమా అయిపోతుంది అనిపించేలా చేశారు.

నటీనటులు :

కొహినూర్ కళ్యాణ్ గా వీజే సన్నీ తన వరకు బాగానే చేశాడు. మంచి ఈజ్ తో ఆ పాత్రకు న్యాయం చేశాడు. అతన్ని వాడుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సప్తగిరి కూడా తన పాత్ర వరకు న్యాయం చేశాడు. ఐపిఎల్ గురించి తన మార్క్ గా చెప్పిన లాంగ్ డైలాగ్ బాగుంది. హీరోయిన్ నక్షత్ర ఏదో ఒకటి రెండు సీన్స్ తప్ప అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేదు. అక్సా ఖాన్ సినిమా మొత్తం సన్నీ సప్తగిరిలతో ఉంటుంది. ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ కూడా ఇచ్చారు. అక్సా ఖాన్ కూడా తన వరకు ఓకే అనిపించుకుంది. ఇక బిత్తిరి సత్తి పోసాని కృష్ణమురళి రఘు బాబు వీరంతా కూడా ఉన్నారు వారికి ఎప్పటిలానే అలా వచ్చి ఇలా వెళ్లే పాత్రలు ఇచ్చారు. మిగతా వారంతా వాళ్ల పరిధి మేరకు నటించారు.  

సాంకేతిక వర్గం :

భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఒక్క అక్సా ఖాన్ సాంగ్ తప్ప అంతగా మెప్పించలేదు. ఈమధ్యనే ధమాకా బలగంతో తనకంటూ ఒక మార్క్ వేసుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాతో నిరాశపరచాడని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా అంత గొప్పగా ఏం లేదు. కథ కథనాల్లో దర్శకుడు డైమండ్ రత్నబాబు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే కథను తను ఇంకాస్త బాగా వర్క్ చేసి ఉంటే బాగా తీయొచ్చు. నిర్మాణ విలువలు పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి.  

చివరగా : అన్ స్టాపబుల్ ఫన్ కాదు  అన్ స్టాపబుల్ బోరింగ్..!

రేటింగ్ : 1.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these